Breaking News

ఆసియాలో ప్రబల శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను విస్మరించడం అసాధ్యం-Beyond Handshakes & Hugs


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనతో ఇరు దేశాల బంధం మరింత బలపడింది. ఒబామా హయాం నాటి సంబంధాలకు కొనసాగింపుగా... మోదీ నెరిపిన దౌత్యం భారత్‌కు ఎంతగానో మేలు చేయనుందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. మొదట్లో భారత్‌ అంటే వ్యతిరేక భావంతో ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌... మన ప్రధానికి ఎర్రతివాచీ పర్చడం ఆసక్తికరంగా మారింది. ఆసియాలో ప్రబల శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను విస్మరించడం అసాధ్యమని ఆయన గుర్తించారు. భారత్‌ను అత్యంత నమ్మదగిన మిత్రుడిగా అభివర్ణించి అమెరికా దృష్టిలో మన స్థానమేంటో ప్రపంచానికి చాటారు. ఈక్రమంలోనే పరస్పర నమ్మకాల మధ్య భారత్, అమెరికా మధ్య మరింత బలమైన సంబంధాల దిశగా విస్తృతమైన చర్చలు జరిగాయి. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు ప్రధానాంశాలు కాగా, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆర్ధిక అంశాలు కూడా కీలకంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఉగ్రవాదుల అడ్డా పాకిస్థాన్‌కు అమెరికా గడ్డపై నుంచి ట్రంప్‌తో కలిసి మోడీ హెచ్చరికలు జారీ చేయడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

1 comment:

  1. భారత్‌ను అత్యంత నమ్మదగిన మిత్రుడిగా అభివర్ణించి అమెరికా దృష్టిలో మన స్థానమేంటో ప్రపంచానికి చాటారు.

    ReplyDelete