Breaking News

ఆచంట రుక్మిణమ్మ-Achanta Rukmini Biography


ఆనాడు దేశంలో సుప్రసిద్ధులైన ఆయుర్వేద వైద్యులు ఎందరో ఉండేవారు. అటువంటి ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీపతి గారు. ఈయన సతీమణి శ్రీమతి ఆచంట రుక్మిణమ్మగారు. ఆమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.

1926 వ సంవత్సరం లో పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిగింది. స్త్రీల హక్కుల గురించి చర్చించే ఆ సభకు మనదేశ ప్రతినిధిగా ఆమె వెళ్ళింది. తర్వాత జిల్లా బోర్డు సభ్యురాలిగా, కార్పొరేషన్ మెంబరుగా, విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేసింది. 1930 వ సంవత్సరం మే నెలలో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొనింది. వేదారణ్యంలో మరో సత్యాగ్రహం సత్యాగ్రహం లో పాల్గొనింది. ఆనాడు జైలుకు వెళ్ళిన తొలి మహిళల జట్టులో నిలిచింది. ఆ తర్వాత 1940 వరకు ఇన్నో సార్లు జైలుకు వెళ్ళింది. తమిళనాడు ప్రాంతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసింది. 1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు.

సమాచార రంగ ప్రముఖులు ఆచంట జానకిరాం వీరి కుమారుడు.

1 comment:

  1. ఆచంట రుక్మిణమ్మ-Achanta Rukmini Biography

    ReplyDelete